సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 25 డిశెంబరు 2018 (16:31 IST)

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్య అయ్యారు..

ఈ క్రిస్మస్ జీవితాంతం గుర్తుండి పోతుందని.. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. విజేత సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ దేవ్.. 2018 క్రిస్మస్‌కు తనయ పుట్టిందని మెగా ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్తను చెప్పారు. తద్వారా మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్య అయ్యారు. చిరంజీవి కుమార్తె శ్రీజ- కల్యాణ్ దేవ్ దంపతులకు పండంటి ఆడశిశువు జన్మించింది. 
 
ఈ విషయాన్ని కల్యాణ్ దేవ్ ఓ పోస్ట్ ద్వారా తెలిపాడు. ఉదయం తమకు అమ్మాయి జన్మించిందని, మీ అందరికీ సూపర్ మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కల్యాణ్ దేవ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌తో పాటు పాప పాద ముద్ర ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు.