బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (12:36 IST)

చిరంజీవి బర్త్‌డే గిప్ట్... "సైరా" ఫస్ట్‌లుక్ రిలీజ్...

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌, టాలీవుడ్ హీరో జగపతి బాబు, తమిళ హీరో విజయ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌, టాలీవుడ్ హీరో జగపతి బాబు, తమిళ హీరో విజయ్ సేతుపతిలు కీలక పాత్రలు పోషిస్తుండగా, నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో వీరిపాత్రలు ఏ విధంగా ఉంటాయోనన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది.
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను అధికారికంగా ఆగస్టు 22వ తేదీన విడుదల చేనున్నారు. ఆ రోజు చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఆ తేదీని ఖరారు చేశారు. చిత్రానికి బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించనున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
కాగా, స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహా రెడ్డి జీవిత నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ 30 శాతం వ‌రకు పూర్తైన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో తాజా షెడ్యూల్ జ‌రుపుకుంటుండ‌గా, 40 రోజుల పాటు మూవీ చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు.