శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 11 మార్చి 2022 (17:27 IST)

చిరంజీవి, స‌ల్మాన్ కాంబినేష‌న్ రాబోతోంది!

chiru-Salman
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా సినిమా గాడ్‌ఫాద‌ర్‌. ఇది మల‌యాళ లూసిఫ‌ర్‌కు రీమేక్‌. ఇందులో మోహ‌న్‌లాల్ న‌టించిన పాత్ర‌ను చిరంజీవి చేస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియాగా తీయ‌డానికి సిద్ధం చేస్తున్నారు. అందుకే ఈ సినిమాలో స‌ల్మాన్ ఖాన్ న‌టించ‌నున్నాడ‌ని తెలిసింది. మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ సుకుమార‌న్ చేసిన పాత్ర‌ను స‌ల్మాన్ చేస్తున్నాడు.
 
చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను ముంబై శివార్లోని ఓ స్టూడియోలో రేప‌టినుంచి చిత్రీక‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కొన్ని యాక్ష‌న్ సీన్స్‌తో పాటు కీల‌క స‌న్నివేశాల్ని ఇక్క‌డ తీయ‌నున్నారు. స‌ల్మాన్ ఇప్ప‌టికే టైగ‌ర్‌3 చిత్రం చేశాడు. చిరంజీవి న‌టించిన ఆచార్య విడుద‌ల‌కు రెడీ అయింది. అయినా చిరంజీవి ఇంకా మూడు కొత్త సినిమాల్లో న‌టిస్తున్నాడు.