శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఆగస్టు 2022 (17:16 IST)

అట్టహాసంగా అలీ పెద్ద కూతురు ఫాతిమా ఎంగేజ్‌మెంట్

Ali daughter
Ali daughter
అలీ పెద్ద కూతురు ఫాతిమా ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో అలీ భార్య జుబేద తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు. తమ కూతురు ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన మొత్తం వీడియోను ఆమె అభిమానులతో షేర్ చేసుకున్నారు.
 
ఈ కార్యక్రమానికి హాస్యబ్రహ్మ బ్రహ్మానందంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. స్టేజ్‌పై జోకులు వేస్తూ.. అందరిని నవ్వించారు. అలీ కూడా బ్రహ్మానందాన్ని దగ్గరుండి రిసీవ్ చేసుకున్నారు. డైలాగ్ కింగ్ సాయి కూమార్ కూడా సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన వధువు వరులను ఆశీర్వదించారు.
  
ముస్లీం సంప్రదాయం ప్రకారం అలీ కూతురు ఎంగేజ్‌మెంట్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఫాతిమాకు కాబోయే వరుడు డాక్టర్ అని తెలుస్తుంది. అంతేకాదు..అలీ వియ్యంకులు వారింటా అందరూ డాక్టర్లేనని జుబేద తన వీడియోలో అందరినీ పరిచయం చేస్తూ చెప్పుకొచ్చారు.
 
 అలీ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు. వీరి కుటుంబం బర్మాలో వ్యాపారం చేస్తుండేది. రెండవ ప్రపంచయుద్ధం కారణంగా బర్మాను వదలి రాజమండ్రి వచ్చి స్థిరపడింది. తండ్రి అబ్దుల్ సుభాన్ (మహమ్మద్ బాషా) దర్జీ పని చేసేవాడు. తల్లి జైతున్ బీబీ గృహిణి.