శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 1 నవంబరు 2018 (22:00 IST)

పుకార్ల‌కు చెక్ పెట్టిన చ‌ర‌ణ్ నిర్మాత దాన‌య్య‌..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రానికి ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ రూపొందుతోన్న‌ ఈ భారీ చిత్రాన్ని డీవీవీ ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పైన డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. అయితే.. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ ఇంకా చాలా ఉంది. అందుచేత‌ సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావ‌డం క‌ష్ట‌మే అంటూ టాక్ వినిపిస్తోంది. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌లపై చిత్ర నిర్మాత దాన‌య్య  ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
 
వ‌చ్చే సంవ‌త్స‌రం సంక్రాంతికి ఈ చిత్రం విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలియ‌చేసారు. అంతేకాకుండా ఫ‌స్ట్ లుక్ & టైటిల్ రిలీజ్ తేదీని అతి త్వ‌ర‌లో ఎనౌన్స్ చేస్తామ‌న్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ & టైటిల్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలిసింది. రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న కైరా అద్వానీ న‌టిస్తున్న ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరోలు ప్ర‌శాంత్, ఆర్య‌న్ రాజేష్ ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. మ‌రి.. ఈ భారీ చిత్రం ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో..?