బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 30 అక్టోబరు 2018 (11:00 IST)

రాజమౌళి #RRR... ముగ్గురు హీరోయిన్లు.. ఓ ఫారిన్ బ్యూటీ

దర్శకధీరుడు రాజమౌళి... ట్రిపుల్ ఆర్ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఇక నవంబర్ ఐదో తేదీన ఈ సినిమాను ప్రారంభించాలనే నిర్ణయానికి రాజమౌళి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు డీవీవీ దానయ్య రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్-చెర్రీ హీరోలుగా కనిపించనున్నారు. 
 
ఇందులో ముగ్గురు హీరోయిన్లు వుంటారని టాక్. వీరి ముగ్గురిలో ఒకరిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారని.. ఫారిన్ బ్యూటీ ట్రిపుల్ ఆర్‌లో మెరుస్తారని టాక్ వస్తోంది. మిగిలిన ఇద్దరు హీరోయిన్లు ఎవరనేది త్వరలో తెలియనుంది. 
 
ఇకపోతే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు వుంటాయని సమాచారం. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్‌కి సంబంధించిన సన్నివేశాన్ని 45 రోజుల పాటు చిత్రీకరించనున్నారట. దీనిని బట్టి ఆ సీన్ ఏ రేంజ్‌లో ఉంటుందనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.