బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 28 అక్టోబరు 2018 (09:36 IST)

పెళ్లి చేసుకున్నా నేను ఇలానే ఉంటా... దీపికా పదుకొనె

పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తాను ఇలానే ఉంటానని బాలీవుడ్ నటి దీపికా పదుకొనె స్పష్టం చేశారు. ఈమె బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడనున్న విషయం తెల్సిందే. వీరిద్దరి వివాహం వచ్చే నె 14, 15 తేదీల్లో హిందూ, క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఇటలీలో జరుగనుంది. 
 
ఇటలీలో వాళ్ల పెళ్లి వేడుక ఉంటుందని తెలిసినా.. ఇంకా పెళ్లి వేడుక ఎక్కడ జరుగుతుందనే దానిపై క్లారిటీ లేదు. ఇన్నేళ్లు చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట చివరకు పెళ్లి పీటలెక్కుతుండటంతో బాలీవుడ్ సినీ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ జంట పెళ్లి సందర్భంగా దీపికా పదుకొనెను మీడియా పలకరించింది. తన పెళ్లి గురించి అడిగింది. దానికి దీపిక ఏం సమాధానం చెప్పిందో తెలుసా? నా పెళ్లి గురించి నేను చాలా ఎగ్జయిట్ అవుతున్నా. నా తదుపరి సినిమా కోసం సంతకం చేసేటప్పుడు ఎంత ఎగ్జయిట్ అవుతానో.. పెళ్లికి కూడా అంతే ఎగ్జయిట్ అవుతున్నా. అందరు ఆడపిల్లల్లాగానే నేను కూడా నా పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నా. అందుకే పెళ్లి అనేది ఏ ఆడపిల్లకైనా ఎగ్జయిటింగే. అది ఎగ్జయిటింగ్‌గానే ఉండాలి. కానీ.. పెళ్లి తర్వాత నా జీవితం మాత్రం ఏం మారదు. ఇప్పుడెలా ఉన్నానో.. పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంటాను.. అంటూ తెలిపింది దీపిక.