ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2024 (15:11 IST)

ఎన్టీఆర్ మణికట్టు బెణికింది అయినా దేవర షూట్ పూర్తి చేశాడు

NTR left hand
NTR left hand
ఎన్టీఆర్ జిమ్ లో కసరత్తు చేస్తుండగా ఎడమచేయి మణికట్టుకు గాయమైంది. దీనికి సంబంధించి ఎన్.టి.ఆర్.  కార్యాలయం ఒక ప్రకటన రూపంలో కొద్దిసేపటి క్రితం తెలియజేసింది.  ఎన్టీఆర్ చాలా రోజుల క్రితం జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు ఎడమ మణికట్టుకు చిన్నపాటి బెణుకు వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా అతని చేతిని నెమ్మదిగా కదలించారు. గాయం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ గత రాత్రి దేవర షూటింగ్ పూర్తి చేశారు.

ఇప్పుడు కోలుకుంటున్నాడు. చేయి మణికట్టు రెండు వారాల్లో సెట్ అవుతుంది. తను త్వరలో తిరిగి షూటింగ్ లను పూర్తిచేస్తారు. ఈలోగా ఈ చిన్న గాయానికి సంబంధించి ఊహాగానాలు నివారించాలని మేము అభ్యర్థిస్తున్నాము. అని తెలియజేసింది. 
 
ఎన్.టి.ఆర్. ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ లో వార్ సినిమా కొంతభాగం చేశారు. మూడు రోజులు నాడు కె.జి.ఎఫ్. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత మరో రెండు సినిమాలు లైన్ లో వున్నాయి.