శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 8 జులై 2021 (19:26 IST)

మ‌న‌వ‌డి ధోతీ ఫంక్ష‌న్ లో దిల్‌రాజు హ‌ల్‌చ‌ల్‌

Dilraju family
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు త‌న ఇంటిలో ఏ ఫంక్ష‌న్ జ‌రిగినా ముఖ్య‌ల‌నే పిలుస్తుంటాడు. అందులోనూ క‌రోనా టైంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా ప‌రిమిత స‌భ్యుల‌తోనే చేసుకుంటాడు. అలాంటిదే ఇటీవ‌లే త‌న మ‌న‌వుడు ఆరాన్ష్ ధోతి ఫంక్షన్ ఇటీవ‌లే గ్రాండ్ గా జరిపాడు. తెల్లని కుర్తా పైజమా ధరించి ఫ్యామిలీ మెంబర్‌ తో ఆ వేడుకలో పాల్గొన్నాడు. మనవడిని భుజానికి ఎత్తుకుని ‘దిల్’ రాజు జోష్ తో డాన్స్ చేసినప్పటి ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.
 
కూతురు హర్షిత రెడ్డి కుమారుడైన ఆర్హాన్‌, అత‌ని తండ్రితో క‌లిసి ఎంజాయ్ చేసినట్టు ఫొటోలు చెబుతున్నాయి. ఇక దిల్‌రాజు క‌రోనా మొద‌టివే్‌లోనే ఎయిర్‌హోస్టెస్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. త‌ను దిల్‌రాజు వెన్నంటివుంటూ సినిమాప‌రంగా త‌గు సూచ‌న‌లు కూడా చేస్తుంది. బిజినెస్ వ్య‌వ‌హారాలు బాగా తెలిసిన ఆమె దిల్‌రాజుకు భాగ‌స్వామికావ‌డం క‌లిసివ‌చ్చింద‌ని స‌న్నిహితులు చెబుతుంటారు.
 
పెండ్లి త‌ర్వాత ఆయ‌న సినిమాలు చేయ‌డంలో బిజీ అయ్యాడు. క‌రోనాత‌ర్వాత పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ‘ఎఫ్ 3’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభ‌మైంది. జెర్సీని హిందీలో తీస్తూ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు.