శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2023 (12:57 IST)

ట్రావెల్+ లీజర్ తో అల్లు అర్జున్ క్యాజువల్ అవతార్‌ ఎందుకో తెలుసా!

Allu arjun new avatar
Allu arjun new avatar
అల్లు అర్జున్ పొడవాటి జుట్టు,  మందపాటి గడ్డంతో కూడా, OG స్టైల్ డాపర్ మనోజ్ఞతను వెదజల్లుతుంది  ఆయన  ఫోటోలు చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. ఆకర్షణీయమైన లుక్స్, స్టైలిష్ ప్రెజెన్స్‌తో, అతను ప్రతి చిత్రంలో తన OG స్టైల్ గేమ్‌ని తీసుకువస్తాడు. ఇలా అల్లు అర్జున్ ను ఫోటో షూట్ చేసి మరింత పాపులర్ చేసింది ట్రావెల్+లీజర్ ఇండియా & సౌత్ ఏషియా సంస్థ. అసలు ట్రావెల్ + లీజర్ కో. అనేది ఓర్లాండో, ఫ్లోరిడాలో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక అమెరికన్ టైమ్‌షేర్ కంపెనీ. సంస్థ ఈరోజు విడుదల చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి.
 
Allu arjun new avatar
Allu arjun new avatar
వివరాల్లోకి వెళితే, పుష్ప ది రూల్ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అధిగమించినప్పుడు  పాన్-ఇండియా స్టార్‌గా మారాడు. ఇది సంచలనం సృష్టించింది. అందరికీ హాట్ ఫేవరెట్ అయ్యాడు. దానితో ఇటీవల ఒక ప్రత్యేక కవర్ ఫోటోషూట్ ట్రావెల్ + లీజర్ బ్రాండ్ గా మారాడు. 
 
ట్రావెల్+లీజర్ ఇండియా & సౌత్ ఏషియాతో నగరంలో విహారయాత్ర చేస్తున్నప్పుడు, ఆగస్ట్ కవర్ స్టార్ పుష్ప విజయాన్ని, సుదూర దేశాలకు అజ్ఞాతంలోకి వెళ్లడం, తన కుమార్తెకు పెరుగుతున్న అభిమానుల సంఖ్య తో పాటు  మరెన్నో విషయాల గురించి అల్లు అర్జున్ మాట్లాడారు. . ది ట్రావెల్+ లీజర్ అల్లు అర్జున్ క్యాజువల్ అవతార్‌లో ఓ భాగం మాత్రమే. 
 
అల్లు అర్జున్  ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైజ్‌కి సీక్వెల్ అయిన పుష్ప 2 ది రూల్‌తో బిజీగా ఉన్నారు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది.