ఆదివారం, 17 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (19:08 IST)

ప్రజలను నవ్వించే సినిమాలే చేస్తా - సెహ‌రి హీరో హర్ష్ కనుమిలి

Harsh Kanumilli
హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సెహరి’. వర్గో పిక్చర్స్ ప‌తాకంపై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన‌ ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో హర్ష్ కనుమిల్లి గురువారంనాడు మీడియా స‌మావేశంలో మాట్లాడారు.  
- సెహ‌రిట్రైల‌ర్ లోనే చిత్రం ఏ స్థాయిలో వుంటుందో  స్ప‌ష్టంగా చూపించింది. ఇన్నేసెంట్ వ్య‌క్తి వధువు సోదరితో ప్రేమలో పడే పాయింట్ చిత్ర క‌థ‌.  దాన్ని ఆద్యంతం వినోదాత్మ‌కంగా మ‌లిచాం.  ఓ సంద‌ర్భంలో నా స్నేహితుడు ఒకసారి తన చూసిన‌ పెళ్లికూతురు సోదరి అందంగా ఉందని చెప్పాడు. అప్పుడు పుట్టిన ఆలోచ‌నే క‌థ‌గా రాసుకున్నాం.
- ఈ సినిమా నిర్మాత  అద్వయ జిష్ణు రెడ్డి  నాకు చిన్ననాటి స్నేహితుడు. ఒక‌రోజు అకస్మాత్తుగా అతను నన్ను పిలిచి  నేను ఒక సినిమాను నిర్మిస్తున్నా అన్నాడు. నేను ఆనందంతో స్వాగ‌తం ప‌లికాను. ఆయన ప్యాషనేట్ ప్రొడ్యూసర్.
 
- 'సెహరి' అంటే యూరోపియన్ భాషలో వేడుక. రన్-టైమ్ 128 నిమిషాలు. సినిమా ఒక పండుగలా ఉంటుంది. నేను కొత్త కథానాయకుడిని అయినా సినిమాకు అంద‌రూ స‌రిగ్గా అమ‌రారు. చ‌క్క‌టి జీబియ‌న్స్ ఇందులో వున్నాయి.  అన్ని వయసుల వారికి నచ్చే సినిమా ఇది. ‘నువ్వు నాకు నచ్చావ్‌’ లాంటి త‌ర‌హాలో ఎంజాయ్ చేసేలా వుంటుంది 
 
- నాకు సినిమా నేపథ్యం లేదు. నేను అండ‌ర్‌-14 క్రికెట్ ఆడాను. సినిమాపై ఇంట్రెస్ట్‌తో కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను. కొన్ని సినిమాల‌కు ఆడిష‌న్ కూడా వెళ్ళాను. కానీ ఎక్క‌డా అవ‌కాశం రాలేదు. అందుకే జిషురెడ్డి నిర్మాత అన‌గానే నాకు క‌లిసివ‌చ్చిన అంశంగా మారింది. 
 
- నాకు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లంటే ఇష్టం అందుకే నేను 'సెహరి' అనే కొత్త-ఏజ్ రొమ్-కామ్ చేశాను. నాకు నటుడిగా మారడానికి పురిగొల్పింది 'టక్కరి దొంగ' వంటి సినిమాలే. రామ్ పోతినేని గారి సినిమాలంటే నాకు కూడా ఇష్టం. ఆయ‌న‌లో కామెడీ, షార్ప్ నెస్ న‌చ్చుతాయి.
 
- మా సినిమా ఏ-క్లాస్ బాలీవుడ్ రోమ్-కామ్ కంటే తక్కువ కాదు. అంత కామెడీ వుంటుంది. ఇందులో సంగీతానికి ప్రాధాన్య‌త వుంది. అన్ని పాట‌లు హిట్ అయ్యాయి. అవే మాకు పేరు తెచ్చి పెట్టాయి.
 
- ఏదైనా రంగంలో నిలదొక్కుకోవాలనుకున్నప్పుడు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. అందుకే నాకు సమయం పట్టింది.  అదృష్టవశాత్తూ, నేను చాలా మంచి రైటింగ్ టీమ్‌తో పని చేయగలిగాను.  
 
- ఈ చిత్ర దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారకను కలిసినప్పుడు, నా క్రియేటివ్ వేవ్ లెంగ్త్ అతనితో సరిపోలుతుందని తెలుసుకున్నాను. అంత‌కుముందు కొంత‌మందిని క‌లిశాను. కానీ ఎవ‌రూ ప్రోత్స‌హించ‌లేదు.  
 
- సంగీత దర్శకుడు కోటి గారికి ఈ సినిమాలో బలమైన పాత్ర లభించింది. ఆయ‌న‌ నటన కొత్త‌గా అద్భుతంగా ఉంది. అభినవ్ గోమతం,  హీరోయిన్ సిమ్రాన్ చౌదరి కూడా న‌ట‌న‌లో బెస్ట్ ఇచ్చారు. అభినవ్ త‌న కామెడీ ఫ్లేవర్‌తో ప్రేక్ష‌కులు పూర్తిగా లీన‌మైపోతారు.  మొద‌టి భాగంలో స్వరకర్త ప్రశాంత్ ఆర్ విహారి అద్భుతమైన ట్యూన్స్ అల‌రిస్తాయి.  సెకండాఫ్‌లో సిమ్రాన్ నటనతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.
 
- నందమూరి బాలకృష్ణ గారికి ‘సెహరి’ చూపించాలనుకున్నాను కానీ కుదరలేదు. రాజశేఖర్ గారికి సినిమా చూపించాను, ఆయనకు బాగా నచ్చింది. మా సినిమా చూసిన వారు మరో 10 మందికి చూడండ‌నేలా వుంటుంది. గ్రాండియర్  విజువల్స్ మా సెహ‌రి ప్ర‌త్యేక‌త‌.
 
- సెన్సార్‌ బోర్డు సభ్యులు సినిమాను చూసి మాకు సానుకూల అభిప్రాయాన్ని అందించారు. మేము సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల కోసం 'సెహరిస‌ని కొంద‌రికి చూపించాం. వారందరికీ ఇది బాగా నచ్చింది. వాలెంటైన్స్ డే కోసం ఇది సరైన రోమ్-కామ్. 
 
- అదేరోజు వేరే సిసిమాలు విడుద‌ల‌వుతున్నాయి. అయినా మా సినిమా ప్ర‌త్యేక‌త మాదే. ఇలాంటి రామ్ కామ్ సినిమాను చూడాలంటే ప్రేక్ష‌కులు థియేటర్‌లకు రావాలని కోరుకుంటున్నాను.
 
- థియేట్రికల్ విడుదలకు ఒక రోజు ముందు కాబ‌ట్టి నేను కొంచెం నెర్వస్ గా ఉన్నాను. అయితే  ఇప్ప‌టికే బాల‌య్య‌బాబు గారి ద్వారా ప‌బ్లిసిటీ, పాట‌లు స్పంద‌న చూశాక  నేను కూడా ఎగ్జైట్‌గా ఉన్నాను.
 
-  'సెహరి' విడుదలయ్యాక కొత్త ప్రాజెక్ట్‌లను అంగీకరిస్తాను. నా ద‌గ్గ‌ర రెండు కథలు ఉన్నాయి. కామెడీ నాకు ఇష్టమైన జానర్. ప్రజలను నవ్వించడం నాకు ఇష్టం.