1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 25 జనవరి 2024 (17:20 IST)

పూరీ జగన్నాథ్, మణిశర్మ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ డబుల్ ఇస్మార్ట్‌ తాజా అప్ డేట్

puri- manisharama
puri- manisharama
రామ్ పోతినేని నటిస్తున్న కొత్త చిత్రం డబుల్ ఇస్మార్ట్‌. పూరీ- -మణిశర్మ క్రేజీ కాంబో  ఇస్మార్ట్ కు సీక్వెల్‌. ఇప్పటికే ఈ సినిమా ఆడియో హక్కులు ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. నేడు పూరీ, మణిశర్మ మ్యూజిక్ ఆల్బమ్ ను తయారు చేస్తూ ఇలా పోస్ట్ పెట్టారు. 
 
మ్యూజిక్ సిట్టింగ్‌లు పూర్తి స్వింగ్‌లో ఉన్నాయి, కొన్ని అద్భుతమైన ట్రాక్‌లు లాక్ చేయబడ్డాయి. అవి రామ్ ఎనర్జీ తోడయి పూనకాలు తెప్పిస్తాయి. మణిశర్మ మామూలుగా బ్యాక్ గ్రౌండ్ ఇవ్వలేదని పూరీ కితాబిచ్చారు. ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్నితెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 8న గ్రాండ్‌ విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే తెలియజేశారు మేకర్స్‌.