ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (10:59 IST)

డాక్టర్‌ రాజశేఖర్‌ కి పితృవియోగం - శ‌నివారం చెన్నైలో అంత్య‌క్రియ‌లు

Dr. Rajasekhar faimily with Varadarajan Gopal
హీరో డా.రాజశేఖర్‌కి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వరదరాజన్‌ గోపాల్‌ (93) గురువారం సాయంత్రం హైద‌రాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వరదరాజన్‌ గోపాల్‌ చెన్పై డీసీపీగా రిటైర్‌ అయ్యారు. 
 
ఆయనకు  అయిదగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. హీరో రాజశేఖర్‌,  వరదరాజన్‌ గోపాల్‌కు రెండో సంతానం. శుక్రవారం ఉదయం 6.30 నిమిషాలకు వరదరాజన్‌ గోపాల్‌ భౌతికకాయాన్ని ఫ్లైట్‌లో చెన్నైకు తీసుకెళ్లనున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
 
ఈ విష‌యాల‌ను జీవిత తెలియ‌జేస్తూ,  నా మామగారు  గోపాల్ గారి మరణాన్ని విచారంగా తెలియజేస్తున్నాను. ఆయన భౌతికకాయాన్ని ఈరోజు చెన్నైకి తరలిస్తున్నారు. నివాళులర్పించాలని కోరుకునే వ్యక్తులు ఈరోజు (శుక్ర‌వారం) సాయంత్రం 4 గంటల తర్వాత ఆయన నివాసంలో (నం. 26, AI బ్లాక్, 8వ ప్రధాన రహదారి, అన్నానగర్, చెన్నై 40) నివాళులర్పించవచ్చు.
 
రేపు (శ‌నివారం) మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆయన అంత్యక్రియలు జరగనున్నాయ‌ని పేర్కొన్నారు.