శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 1 జూన్ 2019 (17:03 IST)

మురళీమోహన్ వెన్నెముకకు శస్త్రచికిత్స... పరామర్శించిన మెగాస్టార్ దంపతులు

నటుడు, నిర్మాత, మాజీ పార్లమెంటు సభ్యుడు మాగంటి ముర‌ళీమోహ‌న్‌కు హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో వెన్నెముక‌కు ఆప‌రేష‌న్ జ‌రిగింది. గత నెల 14వ తేదీన ఆయన అమ్మగారి అస్థికలు గంగానదిలో కలపడానికి వార‌ణాసి వెళ్లారు. ఆ కార్యక్రమం జరుపుతుండగానే మురళీమోహన్‌కు అకస్మాత్తుగా రెండు కాళ్లుకూ సమస్య వ‌చ్చి న‌డ‌వ‌లేని స్థితిలో పడిపోయారు.
 
దాంతో వెంటనే ఆయన వార‌ణాసి నుంచి హైద‌రాబాద్ చేరుకుని కేర్ ఆసుపత్రిని సంప్రదిస్తే వెన్నెముక‌లో సమస్య ఉందని ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. డాక్టర్లు విశ్రాంతి అవసరం అని చెప్పడంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. విషయం తెలిసి మెగాస్టార్‌ చిరంజీవి, తన సతీమణి సురేఖను వెంటపెట్టుకుని ముర‌ళీమోహ‌న్ ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు.