ఖిలాడి నుంచి కొత్త పాట.. ఫుల్ కిక్కు.. వీడియో
మాస్ మహారాజ ఖిలాడి నుంచి కొత్త పాట వచ్చింది. 'ఫుల్ కిక్కు' అంటూ ఈ పాట సాగుతోంది. రవితేజ - డింపుల్ హయతిపై ఈ పాటను షూట్ చేశారు. ఇది మాస్ బీట్ .. అందునా ఫాస్టు బీట్. రవితేజ ఎనర్జీ లెవెల్స్‌కి తగినట్టుగానే ఉంది.
శ్రీమణి సాహిత్యాన్ని అందించగా సాగర్ - మమత శర్మ ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించారు. వచ్చేనెల 11వ తేదీన ఖిలాడి సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీ నాయికలుగా నటిస్తున్నారు.
సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ పాటను సాగర్, మమతా శర్మ ఆలపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. శేఖర్ మాస్టర్ రవితేజ, డింపుల్ హయాతీతో అదిరేటి స్టెప్పులు వేయించారు.