మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (18:31 IST)

ప్రాక్టీస్ సెషన్‌లో హరిహరవీరమల్లు

Pawan Kalyan
Pawan Kalyan
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా హరిహరవీరమల్లు షూటింగ్ షురూ చేయ‌డానికి ముందుగా చిత్ర టీమ్‌తో వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించారు.  డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, ఇత‌ర న‌టీన‌టులు, నిర్మాత ఇందులో పాల్గొన్నారు. త్వ‌ర‌లో సెట్‌పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రం నుంచి స్నీక్ పీక్ ఈరోజు చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. పవన్ కళ్యాణ్ ఫైట్‌ను ప్రాక్టీస్ చేస్తున్న స్టిల్‌ను విడుద‌ల చేశారు.
 
చారిత్ర‌క నేప‌థ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా  పీరియడ్ యాక్షన్ డ్రామా. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ ఇది.  తాజాగా ఈ చిత్రం ప్రాక్టీస్ సెషన్ కి సంబంధించిన ఒక స్నేక్ పీక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ లుక్ తో ఆకట్టుకుంటున్నారు. ఈ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.