శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (13:34 IST)

చిరు బాటలో బాబాయ్ అబ్బాయ్.. ఏంటి సంగతి?

Ramcharan_Pawan
Ramcharan_Pawan
మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో చేయబోయే "వాల్తేరు వీరయ్య' సినిమాలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. 
 
ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఇపుడు చిరు బాటలో పవన్ కళ్యాణ్‌తో పాటు రామ్ చరణ్ కూడా తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. 
 
హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేయనున్నట్టు సమాచారం. అందులో ఒకటి లెక్చరర్ పాత్ర అయితే.. మరొకటి ఐబీ ఆఫీసర్ క్యారెక్టర్ అని చెబుతున్నారు.
 
మరోవైపు రామ్ చరణ్ కూడా శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న చిత్రంలో తొలిసారి తండ్రీకుమారులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. 
 
ముందుగా ఈ పాత్ర కోసం చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేకుంటే మోహన్‌లాల్ లాంటి వేరే హీరోలను అనుకున్నారు. ఫైనల్‌గా రామ్ చరణ్ ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.