Festival Posters
✕

హీరో విశాల్ లాఠీ ఫస్ట్ లుక్ విడుదల

Written By డీవీ
Updated: బుధవారం, 6 ఏప్రియల్ 2022 (17:36 IST)
Lathi First Look
యాక్షన్ హీరో విశాల్ కధానాయకుడిగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'లాఠీ' చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుటుంది. విశాల్ ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు.
 
ప్రస్తుతం హైదరాబాద్‌లో టాప్ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ పర్యవేక్షణలో ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.
 
ఈ రోజు చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. నిర్మాణంలో ఉన్న భవనం ముందు సాలిడ్‌గా నిలబడి, ఒక చేతిలో లాఠీ పట్టుకుని, మరో చేతికి బ్యాండేజీ కట్టుతో ఈ ఫస్ట్ లుక్‌లో విశాల్ కనిపించారు. శరీరమంతా గాయాలతో పాటు భవనం నుండి లేజర్ కిరణాలు విశాల్ పై పడటం కూడా ఈ యాక్షన్ పోస్టర్‌లో గమనించవచ్చు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విశాల్ పవర్ ఫుల్ గా కనిపించారు. యాక్షన్‌తో నిండిన ఈ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలని పెంచింది.  
 
సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి వుంది. విశాల్ తన 'లాఠీ' తో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికారో అన్నది ఆసక్తికరం. ఈ చిత్రానికి అన్ని భాషలకు ఒకే టైటిల్ పెట్టారు. ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్‌ని దర్శకుడు వినోద్ కుమార్ సరికొత్త కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విశాల్ ఫుల్ లెంత్ యాక్షన్‌కి ప్రాధాన్యత వున్న పాత్రలో నటిస్తున్నారు.
 
విశాల్ సరసన సునైనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలసుబ్రమణ్యన్ ఛాయాగ్రహకుడిగా, సామ్ సిఎస్ సంగీత దర్శకుడిగా, పొన్ పార్థిబన్ రచయితగా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

అన్నీ చూడండి

నవంబర్ 26 నుంచి కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

2027 జనవరిలో మూసీ నదీతీర అభివృద్ధి పనులు ప్రారంభం

తిరుమలలో ఏడుగురు యాత్రికుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం

ప్రియుడి చేతిలో టెక్కీ హత్య.. మోసం చేసిందని గోడకు తలను బాదాడు.. రాత్రంతా శవం పక్కనే...?

బుధవారం, నవంబర్ 25, 2026న తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంటుంది?

అన్నీ చూడండి

లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్‌ క్యాన్సర్‌

రిలాప్స్‌-రెఫ్రాక్టరీ మల్టిపుల్‌ మైలోమా చికిత్సకు సీడీఎస్‌సీఓ ఆమోదిత బ్లెన్‌రెప్‌ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్‌కే

విటమిన్ డి లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి?

క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ

తర్వాతి కథనం
Show comments