టచ్ మీ అంటోన్న మీరా జాస్మిన్!
చాలా కాలం నటిగా గేప్ తీసుకున్న మీరా జాస్మిన్ ఇప్పుడు మరలా సినిమాలోకి రావాలనే ఎదురుచూస్తోంది. తన సోషల్‌మీడియా వేదిక టచ్‌మీ.. అంటూ అవకాశాలు ఇవ్వమని అడుగుతోంది. అమ్మాయి బాగుంది, భద్ర, గుడుంబా శంకర్, యమగోల మళ్ళీ మొదలైంది, మహారధి వంటి పలు చిత్రాల్లో నటించింది. 2014లో దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌తో తిరువనంతపురం వివాహం ఆ తర్వాత కొన్నాళ్ళు సినిమారంగానికి దూరంగా వుంది. పలు బాధ్యతలవల్ల తను దూరంగా వున్నట్లు చెప్పింది. ప్రస్తుతం వైవాహిక జీవితం గురించి తెలియలేదుకానీ, సినిమాల్లోకి రావడానికి తగు విధంగా తయారయినట్లు చెప్పింది.
తాజాగా ఆమె పెట్టిన పోస్ట్‌లో చాలా క్యూట్‌గా కొత్తగా కనిపిస్తోంది. నాగ్ అశ్విన్ చేయబోయే సినిమాల్లో మీరా అప్రోజ్ అయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది. మరి నటిగా చాలా కాలం గేప్ వచ్చిన ఆమె ఆహార్యంలో పెద్దగా మార్పు కనిపిచకపోవడంతో ఎటువంటి పాత్రలు చేస్తుందో చూడాలి.