నేను పూర్తిగా కోలుకున్నా - విశాల్
కథానాయకుడు విశాల్ ఇటీవలే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో బాగా గాయాలు పాలయ్యారు. సామాన్యుడు సినిమా చేస్తున్నప్పుడు హోటల్‌లో ఫైట్ సందర్భంగా రౌడీలతో ఫైట్స్ చేస్తుండగా మొహానికి గాజు పెంకులు గుచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత యాక్షన్ సీన్‌లో జంప్ చేసేటప్పుడు రౌడీ కొడితే ఎగిరి అవతల గోడకు గుద్దుకుని కింద పడాలి. ఆ సన్నివేశంలో కిందపడేటప్పుడు వెన్ను భాగానికి దెబ్బ తగిలింది.
తాజాగా నూతన చిత్రం లాటీ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. ఆ చిత్రం షూట్‌లో గత నెలలోనే యాక్షన్ సీన్ చేస్తుండగా మరింత గాయపడ్డాడు. ఆ తర్వాత ఆయన రెస్ట్ తీసుకున్నారు. ఈరోజే తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలా ఇలా తెలియజేస్తున్నాడు విశాల్.
నేను తిరిగొచ్చేశాను. కేరళలో కొన్ని వారాల పునరుజ్జీవనం పొందిన తర్వాత. ఈ సందర్భంగా గురు కృపా ఆయుర్వేద చికిత్స కేంద్రం, పెరింగోడ్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పూర్తి ఫిట్ గా వున్నా.రేపటి నుంచి హైదరాబాద్‌లో `లాఠీ` చిత్రం చివరి షెడ్యూల్ కోసం తిరిగి సిద్ధంగావున్నానంటూ.. పేర్కొన్నాడు.