శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (23:25 IST)

సినిమాల‌న్నీ ఇష్టంతోనే చేశా. నాందికి చాలా క‌ష్ట‌ప‌డ్డాః అల్లరి నరేష్

Allari Naresh, Nandi
నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ఏ సినిమా అయినా ఇష్ట‌ప్ర‌కార‌మే చేశాను. అది ప్లాప్ అయితే కార‌ణం ఎవ‌రూకాదు. అందుకు బాధ్యుడ్ని నేనే. యాక్ష‌న్‌3డి అనే సినిమా చేశాను. అప్ప‌ట్లో అది కొత్త‌గా వుంటుందనిపించింది. కానీ సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చాక కార‌ణాలు ఏమిట‌నేవి బేరీజు వేసుకున్నా. ఇదేకాదు అన్ని సినిమాల‌కు ఇలానే జ‌రుగుతుంది. సినిమా విడుద‌లైతే మ్యాట్నీకే మాకు అర్థ‌మ‌యిపోతుంది. అందుకే చేసిన త‌ప్పులు మ‌ర‌లా చేయ‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వుంటాను. అలా తీసుకుని వైవిధ్య‌మైన క‌థాంశంతో చేసిన సినిమానే `నాంది` అని క‌థానాయ‌కుడు అల్లరి నరేష్ స్ప‌ష్టం చేశారు. ఈనెల 19న విడుద‌కాబోతున్న సంద‌ర్భంగా ఆయ‌న చెప్పిన విశేషాలు.
 
బంగారు బుల్లోడు గ‌త‌నెల రిలీజ్ అయ్యింది. సంతృప్తిగా అనిపించిందా?
లేదు. అది ఎప్పటి నుంచో డిలే అవుతూ వస్తున్న ప్రాజెక్ట్ ఎప్పుడో 2018లో స్టార్ట్ చేసింది అది. దాని తర్వాత `మహర్షి` రావడం మొత్తం మారడంతో నేను కూడా రెగ్యులర్ సినిమాలు చెయ్యకూడదు అనుకున్నా నాకు గుర్తింపు రావాలి సినిమా కూడా సక్సెస్ అవ్వాలి అనుకున్నాను. అలాగే బంగారు బుల్లోడు అనుకున్న స్థాయి సక్సెస్ కాకపోవడం కాస్త బాధగానే అనిపించింది.
 
స్క్రిప్ట్ సెలక్షన్ లో ఇప్పుడెలా ఎంచుకుంటున్నారు?
అది కామెడీ కథ అయినా లేక సీరియస్ కథ అయినా సరే ఏదైనా చిన్న పాయింటే ఉంటుంది కానీ దానిని ఎలా అల్లారు అన్నదే లెక్కలోకి వస్తుంది. ఈ సీన్స్ ఈ సీన్స్ పెట్టాం అని కాకుండా ఓవరాల్ గా ఎలా వచ్చింది అన్నది ముఖ్యం. కాన్సెప్ట్ బలంగా అనిపిస్తే అది కామెడీ అయినా వేరే కథ అయినా ఓకే చేస్తున్నా ఇప్పుడు.
 
`నాంది` సినిమాలో సెల్‌లో బ‌ట్ట‌లులేకుండా వున్న‌ట్లు అనిపించేలా చూపించ‌డానికి కార‌ణం?
జైలులో సెల్‌లో వున్న వ్య‌క్తిని ఎలా పోలీసులు డీల్ చేస్తారు అనేది స‌హ‌జంగా చూపించాల‌ని చేసిన ప్ర‌య‌త్న‌మే అది. క‌థ ప‌రంగా అలా వుంటుంది. ఇప్పుడు సినిమాతీరు మారింది. మ‌ల‌యాళ సినిమాలు చూసి అలాంటి స‌హ‌జ‌మైన చిత్రాలు మ‌నం ఎందుకు తీయ‌డంలేద‌ని విమ‌ర్శ వుంది. నాంది సినిమా అది భ‌ర్తీ చేయ‌గ‌ల‌ద‌ని ఆశిస్తున్నా.
 
నాంది టైటిల్ కు ఇన్స్పిరేషన్ ఏంటి?
నాంది అంటే ఒకదానికి ప్రారంభం అని అండి. మేము చెప్పేది ఒక కొత్త ప్రాసెస్, ఒక కొత్త సెక్షన్ ను చెప్తున్నాం దానిని బిగినింగ్ అనమాట అందుకు ఈ టైటిల్ నాంది అని తీసుకున్నాం.
 
ఈ రోల్ కోసం స్పెషల్ వర్క్ ఏమన్నా చేసారా?
ముందు ఖైదీల గురించి చదివి తెలుసుకున్నాను. తర్వాత ఆ జైలు వాతావరణం ఖైదీలు కోసం చాలానే తెలుసుకున్నాం. అలాగే లా లో ఎవరికీ తెలీని ఒక కొత్త పాయింట్ కూడా చెప్పబోతున్నాం. ఇంకా జేడీ లక్ష్మి నారాయణ గారిని మ‌రికొంత మంది ప్రముఖుల్ని కలిసి మా డైరెక్టర్  రీసెర్చ్ చేశారు. థర్డ్ డిగ్రీ విన్నాం కానీ అది ఎలా ఉంటుంది ఇలాంటి అన్ని చూపించారు.
 
లాలో త‌ప్పొప్పుల్ని ఎత్తి చూపించిన‌ట్లు తెలుస్తోంది?
రాజ్యాంగంలో లా అనేది ప‌విత్ర‌మైంది. త‌ప్పుచేయ‌నివాడికి శిక్ష‌ప‌డ‌కూడ‌దు. కానీ నేను రీసెర్చ్ చేస్తుండ‌గా ఓ ఖైదీకి 7 ఏళ్లు శిక్ష‌వేశారు. చివ‌రికి అత‌ను త‌ప్పులేద‌ని వ‌దిలేశారు. ఇలాంటివి వింటుంటే ఒళ్ళు గ‌గుర్పాటు క‌లుగుతుంది. నాంది సినిమా విడుద‌ల‌య్యాక లా వ్య‌వ‌స్థ‌పై ఏమి చెప్పామో అంద‌రూ ఆలోచించేలా వుంటుంది.
 
ఈ సినిమాకు మీకు అవార్డు వస్తుంది అని అంతా అంటున్నారు?
అవార్డు వస్తుంది అని కాదండి, ఈ సినిమా హిట్టయితే అదే నాకు పెద్ద అవార్డు. ఏ సినిమా చేసిన ఇది పెద్ద క్లాసిక్ అవుతుంది అవార్డు వస్తుంది అని అనుకోము అది సక్సెస్ అయితే అదే చాలు అనుకుంటాం అదే మాకు పెద్ద అవార్దు.
 
మీరు చేసిన కొన్ని రోల్స్ కు మంచి ప్రశంస వచ్చింది వాటితో సక్సెస్ కూడా వస్తే ఇంకా ఎక్కువ రోల్స్ ఆశించొచ్చా?
ఖచ్చితంగా అండి. మహర్షి లో ఆ రోల్ చూసి నాకు ఈ ఆఫర్ ను డైరెక్టర్ ఇచ్చారు. ఒకవేళ నాంది హిట్టయితే ఇంకా కొత్త కాన్సెప్ట్ సినిమాలు వస్తాయి. ఇది వరకు నేను కామెడీ సినిమాలు చేసినప్పుడు జనం నరేష్ కామెడీ సినిమాలు బాగున్నాయి అన్నారు కానీ గమ్యం, మహర్షి లాంటి సినిమాలు చూసి ఆర్టిస్ట్ గా నరేష్ బాగా చేసాడు అన్నారు. అలా నరేష్ ఒక్క కామెడీ రోల్స్ లోనే కాదు ఇలాంటి రోల్ కూడా అద్భుతంగా చెయ్యగలడు అనుకోవాలి.
 
ఈ సినిమా చేసేటప్పుడు ఛాలెంజింగ్ సీన్స్ ఏమన్నా అనిపించాయా?
ఛాలెంజింగ్ సీన్స్ అంటే ఈ సినిమాకు శారీరికంగా ఎక్కువ కష్టపడ్డాను, ముందు లడ్డుబాబు సినిమాకి చాలా కష్టపడ్డాను ఆ మేకప్ అంతటకీ కానీ ఈ సినిమాకు కాళ్ళు చేతులు కట్టేసి అన్ని యాంగిల్స్ లో చెయ్యాల్సి వచ్చింది అది కొన్ని సెకండ్స్ మాత్రమే ఉన్నా సాయంత్రం 6న్నరకి స్టార్ట్ చేస్తే రాత్రి 11 గంటలకు అయ్యింది. ఇలా ఫిజికల్ సీన్స్ కాస్త ఛాలెంజింగ్ అనిపించాయి.
 
వరలక్ష్మి గారితో ఫస్ట్ టైం సినిమా ఎలా అనిపించింది?
ఆమెలో మెచ్చుకోవాల్సింది ఏదన్నా ఉందంటే నేనొక హీరో కూతురిని నేను హీరోయిన్ గానే చేస్తాను అని అలాంటివి పెట్టుకోకుండా రోల్స్ చెయ్యడం, నాకు అయితే ఆమెలో ఒక లేడీ విజయ్ సేతుపతి కనిపిచింది. తాను ఎలాంటి రోల్స్ అనే కాకుండా తనకు ఎంత పేరు వస్తుంది కంటెంట్ బాగుందా లేదా అనే చూసి చేస్తుంది. అలాగే ఆమె చాలా ఇంటెన్స్ పెర్ఫామెన్సర్.
 
మరి ఈ సినిమా తమిళ్ రిలీజ్ కు అవకాశం ఉందా?
అడుగుతున్నారు హిందీ తమిళ్ నుంచి ఆల్రెడీ రీమేక్ కోసం మాట్లాడుతున్నారు. కానీ నాకు అయితే గమ్యం తర్వాత అంత కాన్ఫిడెంట్ గా మళ్లీ ఉన్నాను. ఆ సినిమా 7 భాషల్లో రీమేక్ చేశారు దీనిని మాత్రం హిందీలో ఖచ్చితంగా రీమేక్ చేస్తారు అనుకుంటున్నా.
 
సుడిగాడు లాంటి స్పూఫ్ సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసినట్టేనా?
ఇప్పుడు అలాంటివి అన్ని అయ్యిపోయాయి, ఇది వరకు అంటే సినిమాలు తీసి చూపించే వాళ్ళం కానీ ఇప్పుడు రేపటికి యూట్యూబ్ లో వచ్చేస్తున్నాయి. అలాంటివి అడిగారు కానీ చెయ్యలేదు. ఇక్కడ ప్రాబ్లెమ్ ఏంటి అంటే సరైన కథలు రాసే వాళ్ళు తక్కువ అయ్యారు. ఈ మధ్యనే ఓ కథ కూడా వచ్చింది ఎవడి గోల వాడిది టైప్ లో కానీ అంత మంది కమెడియన్స్ బ్యాలెన్స్ చేస్తూ తీసేవాళ్ళు కూడా ఉండాలిగా మెయిన్ గా తీసేవాళ్ళే తగ్గారు. మంచి కథలు మంచి రైటర్స్ వస్తే కనుక మళ్ళీ కామెడీ ఖచ్చితంగా ఉంటుంది.
 
 ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?
కొన్ని కథలు ఉన్నాయి చాలానే విన్నాను అలాగే ఈ సినిమా డైరెక్టర్ విజయ్ తోనే ఇంకో సినిమా అనుకుంటుంన్నాం. ఇందులో బ్రుటాలిటీ చూపిస్తే అందులో ఒక ఫర్ పోలీస్ కథ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా రిలీజ్ కోసం చూస్తున్నా.