ఆ రాత్రిళ్లలో నాకు అస్సలు నిద్ర పట్టలేదు: సమంత
సమంత అక్కినేని నటించిన తాజా చిత్రం ఓ బేబీ. ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్ ఇది.
ఆల్రెడీ ఈ సినిమా 7 భాషల్లో విజయాన్ని సాధించింది. ఎప్పటి నుంచో పూర్తిస్థాయి హాస్యప్రధానమైన సినిమా ఒకటి చేయాలనే కోరిక వుంది. మిస్ గ్రానీ చూసిన తరువాత ఈ సినిమా రీమేక్‌లో తప్పకుండా నటించాలని నిర్ణయించుకున్నాను అని సమంత చెప్పారు. ఈ సినిమా జులై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ... ఇక మూడు రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనగా నాకు అసలు నిద్ర పట్టేది కాదు. ఎందుకంటే... ఓ మంచి రోల్ చేస్తున్నాను అనే ఫీలింగ్తో. నా గత చిత్రాల కంటే భిన్నంగా ఉంటుంది. అలాగే నాకు నెక్ట్స్ ఛాప్టర్ అనిపించింది. ఓ బేబీ ఈ విధంగా నిద్ర లేని రాత్రులు ఇచ్చింది. ఇది ఫుల్ లెంగ్త్ కామెడీ. ఈ సినిమాకి సంబంధించిన ప్రతిరోజు షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ మరచిపోలేను. ఈ సినిమా చేసినందుకు చాలా చాలా గర్వంగా ఉంది.
నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాకి లక్ష్మీ గారే కావాలి. రాజేంద్రప్రసాద్ గారే కావాలి. అలాగే చిన్న క్యారెక్టర్‌కైనా సరే.. వాళ్లే కావాలి అని పట్టుబట్టి తీసుకోవడం అనేది చాలా బాగా నచ్చింది. ఇక లక్ష్మీ గారి గురించి చెప్పాలంటే... ఇద్దరూ ఒకేలా ఉన్నారేంటి అని చాలామంది అడిగారు. మా ఇద్దరి హైట్ కూడా సేమ్. అలా.. కుదిరింది.
సినిమా కూడా అందరికీ నచ్చి పర్ఫెక్ట్ ఫిల్మ్ అవుతుందని ఆశిస్తున్నాను. రాజేంద్రప్రసాద్ గారి గురించి చెప్పాలంటే.. ఆయన కింగ్ ఆఫ్ కామెడీ.. అందరికీ తెలిసిందే. ఆయనతో ఉంటే కామెడీ వేరేలా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే.. ఇద్దరం ఎలా చేస్తే బాగుంటుందో మాట్లాడుకుని చేసాం. సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయ్. ఇంకా చెప్పాలంటే ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. సినిమా చూసిన తర్వాత అందరూ చంటి క్యారెక్టర్ గురించే మాట్లాడతారు.
ఈ సినిమాని 200 మందికి చూపించాం. కొరియన్ సినిమా చూసిన వాళ్లు కూడా ఇది తెలుగు సినిమాలా ఉంది. చాలా బాగుంది అని చెప్పారు. సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్లు చెప్పింది ఏంటంటే... అమ్మకు ఫోన్ చేయాలనిపించింది అన్నారు. మేము కనెక్ట్ అయినట్టే.. వాళ్లు కూడా ఎక్కడో కనెక్ట్ అయ్యారు. లేడీస్‌కి అయితే.. విపరీతంగా నచ్చుతుంది అని గట్టి నమ్మకం అన్నారు.