మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 7 జనవరి 2025 (18:10 IST)

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

Naga vamsi- Balayya
Naga vamsi- Balayya
తెలుగు సినిమా రంగంలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన బిజినెస్ అంచనాలతో ముందుకుసాగుతున్నారు. ఆయన నిర్మించే సినిమాల విషయంలో ముందుగా ఓటీటీ బిజినెస్ అయ్యాకే థియేటర్ కు వెళతారని దాంతో విజయాలు సాధిస్తున్నారని ఈజీగా బిజినెస్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ వుంది. తాజాగా బాలక్రిష్ణ తో ఢాకు మహారాజ్ సినిమా తీశారు. ఈ సినిమా ముందుగానే ఓటీటీ బిజినెస్ అయింది.
 
నాగవంశీ మాట్లాడుతూ, నేను స్క్రిప్ట్ దశలోనే పలువురి సలహాలు తీసుకుంటాను. అందులో ఓటీటీవారికి కథ చెబుతా. వారికి నచ్చితే వెంటనే సెట్ పైకివెలతాను. అలాగే పంపిణీదారులకు కూడా చర్చిస్తాను. ఈ క్రమంలో ఏదైనా అంశం నచ్చకపోతే కథలో పలు మార్పులు చేయాల్సివస్తుంది. బహుశా అందులో నా గురించి అలా వార్తలు వస్తుంటాయని వివరించారు. గతంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచి కలర్ కాలం వరకూ కొంతవరకూ సినిమా సెట్ కు వెళ్ళేముందు పంపిణీదారులు, శాటిలైట్ వారు ముందుగా స్క్రిప్ట్ వినిపించేవారు. వారు ముందుగా అడ్వాన్స్ లు కూడా ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ప్లేస్ ను ఓటీటీ దక్కించుకుంది.