విశ్వనాథ్‌తో వుంటే ప్రపంచమే మా ముందున్నట్లుండేది : చంద్రమోహన్
సీనియర్ నటుడు చంద్రమోహన్ దర్శకుడు విశ్వనాథ్‌గారికి ఫిలింనగర్‌లోని ఆయన ఇంటికి వచ్చి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌గారితో వున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1966లో ఆయన నేను ఒకేసారి ఈ రంగంలోకి వచ్చాం. అప్పటినుంచి ఆయన మాకు నా తెలుసు. మా కుటుంబం ఆయనకు చాలా సన్నిహితం. ఆయనతో సిరిసిరిమువ్వ నుంచి పలు సినిమాలు చేశాను. ఎప్పుడో ఏదో కొత్త విషయం ఆయన్నుంచి నేర్చుకునేవాళ్ళం.
ఆయన లేకపోవడం పరిశ్రమకే కాదు మా కుటుంబాలన్నింటికీ తీరనిలోటు. మా వదినకు మనశ్సాంతి కలగాలి. ఆయన ఇంటర్‌నేషనల్ లెవల్‌లో ప్రఖ్యాతి గాంచారు.నాయన సినిమాల్లో నటుడిగా చేసినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన శివైక్యం పొందడంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను.