బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (07:10 IST)

గాడ్ ఫాద‌ర్ వీడియో సాంగ్ అనుకుంటే ఆడియో వ‌దిలారు ఎందుకంటే...

chiru-salman
chiru-salman
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “గాడ్ ఫాథర్”. సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేష‌న్‌లో మాస్ సాంగ్ `తార్ మార్ త‌క్క‌ర్‌` సాంగ్ ప్రోమోను మొన్న విడుద‌ల చేశారు. పూర్తి సాంగ్‌ను సెప్టెంబ‌ర్ 15వ తేదీ సాయంత్రం 5గంట‌ల‌కు విడుద‌ల‌చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత రాత్రి 7గంట‌ల‌కు అని తెలియ‌జేశారు. అయితే 7గంట‌ల‌కు కేవ‌లం ఆడియోసాంగ్‌ను మాత్ర‌మే విడుద‌ల చేశారు. దానితో అభిమానులు కాస్త నిరుత్సాహ‌ప‌డ్డా, ఆడియో సాంగ్‌ను విని ఎంజాయ్ చేశారు. మ‌రి పూర్తి వీడియోసాంగ్‌ను ప్రేక్ష‌కుల్లోనూ, అభిమానుల్లోనూ ఉత్కంఠ‌ను రేకెత్తిస్తూ హైప్ క్రియేట్ చేయ‌డానికి చేసిన‌ట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. 
 
ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా అయితే తెరకెక్కించారు. మరి దసరా కానుకగా రిలీజ్ కి సిద్ధం గా ఉన్న ఈ చిత్రంపై ఆల్రెడీ మంచి హైప్ ఉంది. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య నిరుత్సాహ‌ప‌రిచింది. దానికి ఫుల్‌ఫిల్ చేయ‌డానికి బాలీవుడ్ స్టార్‌ను ఇందులోపెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్ తొలిసారి.  కాగా, ఈ చిత్రానికి ఇప్పుడు భారీ మొత్తంలో బిజినెస్ జ‌రుగుతున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ సినిమాతోనైనా చిరంజీవి స‌క్సెస్ కొడ‌తారేమో చూద్దాం.