మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (12:27 IST)

రజనీకాంత్ ప్రధాన మంత్రి అయితే ఇంకేముంది?: రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. జీఎస్టీ సినిమా తీసి ఆన్‌లైన్‌లో విడుదల చేసి సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ.. ఆ సినిమా నిషేధానికి గు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. జీఎస్టీ సినిమా తీసి ఆన్‌లైన్‌లో విడుదల చేసి సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ.. ఆ సినిమా నిషేధానికి గురైన వేళ.. సోషల్ మీడియాలో రజనీకాంత్‌పై కామెంట్లు చేశాడు. సూపర్ స్టార్ రాజకీయ ఎంట్రీతో పాటు రోబో సినిమాపై వర్మ స్పందించాడు. 
 
ఇంతకీ ఏమన్నాడంటే.. ప్రపంచ వ్యాప్తంగా వున్న 200 దేశాల్లో భారత్ కూడా ఒకటన్నాడు. అదే రజనీకాంత్ ప్రధాని అయితే భారత్ కచ్చితంగా అమెరికా స్థాయికి చేరుతుందని ఆసక్తికర కామెంట్ చేశాడు. 2.జీరో నుంచి 200కి తేరుతుందని పేర్కొన్నాడు. 
 
అలాగే మరో ట్వీట్‌లో శివ సినిమాతో నాగార్జున తనకు కిక్ స్టార్ట్ ఇచ్చాడని..ఇన్నేళ్ల తర్వాత తనకు మరో కిక్ కావాలి. నాగ్‌తో చేసే సినిమా తేదీ, సమయం ప్రకటిస్తానని వెల్లడించాడు. నాగార్జునతో హిట్ కొట్టకపోతే.. ఆయన ఫ్యాన్స్ తనను తన్నేందుకు సిద్ధంగా వున్నారన్నాడు.