మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (13:36 IST)

మా కుర్రాళ్లపై చేతబడి జరిగింది... అందుకే ఇండియాపై ఓడిపోయాం... పాక్ టీమ్ మేనేజర్

అండర్ 19 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ పోటీలో టీమిండియా కుర్రాళ్ల చేతుల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు చెపుతున్న కారణాలను చూసి అటు పాకిస్తాన్ ఇటు ఇండియాలో నవ్వులే నవ్వులు కురుస్తున్నాయి. పాకిస్తాన్ దేశంలో అయితే పరాజయానికి చెపుతున్న కారణాలను చ

అండర్ 19 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ పోటీలో టీమిండియా కుర్రాళ్ల చేతుల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు చెపుతున్న కారణాలను చూసి అటు పాకిస్తాన్ ఇటు ఇండియాలో నవ్వులే నవ్వులు కురుస్తున్నాయి. పాకిస్తాన్ దేశంలో అయితే పరాజయానికి చెపుతున్న కారణాలను చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియడంలేదు. ఇంతకీ పాక్ టీమ్ ఓటమికి కారణాన్ని ఆ టీమ్ మేనేజర్ నదీమ్ ఖాన్ చెపుతున్న రీజన్ ఏమిటో తెలుసా?
 
పాకిస్తాన్ కుర్రాళ్లపై చేతబడి జరిగిందేమోనన్న అనుమానం కలుగుతోందట. అందుకే భారీగా 203 పరుగుల తేడాతో ఓడిపోయారని చెపుతున్నాడు. అంతేకాదు... కుర్రాళ్లు మైదానంలోకి వెళ్లాక అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదనీ, వరుసగా టపాటపా వికెట్లు నేల కూలాయన్నారు. దీన్నంతా చూసినప్పుడు తమ జట్టుపై ఖచ్చితంగా చేతబడి జరిగి వుంటుందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మరి ఈయన వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటో చెప్పండి.