ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (10:32 IST)

'తంత్రం లేని సేనాని.. యుద్ధం లేని సైన్యం' : కత్తి మహేష్ ట్వీట్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రజా యాత్రపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ స్పందించారు. తంత్రం లేని సేనాని. యుద్ధం లేని సైన్యం అంటూ ట్వీట్స్ చేశారు. దీనిపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రజా యాత్రపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ స్పందించారు. తంత్రం లేని సేనాని. యుద్ధం లేని సైన్యం అంటూ ట్వీట్స్ చేశారు. దీనిపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. 
 
'అజ్ఞాతవాసి' చిత్రం విడుదల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి దూకిన విషయం తెల్సిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇందుకోసం 2019 వరకూ సినిమాలను సైతం పక్కనపెట్టాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. పవన్ పర్యటనకు అనూహ్య స్పందన వస్తోంది. 
 
దీనిపై కత్తి మహేష్ స్పందించారు. "తంత్రం లేని సేనాని. యుద్ధం లేని సైన్యం. సమస్య ఇంకా బేసిక్ లెవల్‌లోనే ఉంది. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఏదో ఒకటి చెయ్యొచ్చు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాల వైపు వచ్చేలోగా ఎంతో కొంత మార్చొచ్చు" అంటూ వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు పవన్ ఉద్దేశించి అయి ఉంటాయని భావిస్తున్నారు.