Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధువు మెడలో మూడుముళ్లు వేసిన వరుడిని గృహంలో బంధించారు...

Updated: సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (09:41 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని ఓ పెళ్లింట కలకలం రేగింది. మరికొన్ని క్షణాల్లో వధువు మెడలో మూడుముళ్లు వేసిన వరుడుని గదిలో బంధించారు. ఇలా నిర్బంధించడానికి గల కారణాలను ఆరా తీయగా సదరు వ్యక్తికి ఇదివరకే వివాహమైనట్టు తేలింది. 
 
ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జగిత్యాల జిల్లాలోని పోరండ్ల గ్రామానికి చెందిన రాజశేఖర్‌ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో ఆదివారం వైభవంగా పెళ్లి జరగాల్సివుంది. అయితే, రాజశేఖర్‌తో తనకు గతంలోనే పెళ్లి అయిందంటూ ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరుకు చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. 
 
దీంతో వరుడి నిర్వాకం బయటపడింది. దీంతో వధువు బంధువులు...రాజశేఖర్‌ను గదిలో బంధించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. మరోవైపు ఉట్నూరు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments