శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (16:19 IST)

పొలిటిక‌ల్ సెటైరిక‌ల్ చిత్రంగా జ‌నం వస్తోంది

Suman, Ajay Ghosh
Suman, Ajay Ghosh
సుమ‌న్, అజ‌య్ ఘోష్, కిషోర్, వెంక‌ట ర‌మ‌ణ‌, ప్ర‌గ్య‌ నైనా  ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం `జ‌నం`.  వెంక‌ట ర‌మ‌ణ ప‌సుపులేటి స్వీయ‌ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైల‌ర్ ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో రిలీజ్ చేశారు. 
 
న‌టుడు సుమ‌న్ మాట్లాడుతూ...``ఈ సినిమా ఒంగోలులో షూటింగ్ చేశాం.   `నేటి భారతం` కూడా అక్క‌డే షూటింగ్ జ‌రిగింది. ఆ సినిమా జ్ఞాప‌కాలు క‌ళ్ల ముందు క‌దిలాయి. అదే కోవ‌లో వ‌స్తోన్న చిత్రం జ‌నం. ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న క‌రప్ష‌న్ తో పాటు అన్యాయాలు, అక్ర‌మాల గురించి ద‌ర్శ‌కుడు చాలా చ‌క్క‌గా చూపించారు. సందేశంతో పాటు మంచి ఎంట‌ర్ టైన్ మెంట్ కూడా ఉంటుంది. ఈ త‌రం పిక్చ‌ర్స్ వారి చిత్రాలు ఎలా ఉంటాయో అలా  ఈ చిత్రం కూడా ఉంటుంది. ఎల‌క్ష‌న్స్ స‌మ‌యంలో ఈ చిత్రం రావ‌డం గొప్ప విష‌యం. ప్ర‌జ‌ల్లో మార్పు రావాల‌ని చెప్పే చిత్రం" జ‌నం" అన్నారు.
 
న‌టుడు అజ‌య్ ఘోష్  మాట్లాడుతూ...``స‌మ‌కాలీన రాజ‌కీలయ అంశాల‌పై ఈ చిత్రం రూపొందింది.  క‌మ‌ర్షియ‌ల్ అంశాలు కూడా మెండుగా ఉంటాయి. ద‌ర్శ‌కుడు వెంక‌ట ర‌మ‌ణ గారు సినిమా రంగంలో ఎంతో అనుభ‌వం ఉన్న వ్య‌క్తి.  అన్నీ తానై ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. జ‌నానికి సంబంధించిన చిత్రం కాబ‌ట్టి బాధ్య‌త‌గా ఈ చిత్రంలో న‌టించా. సుమ‌న్ గారితో ఈ చిత్రంలో న‌టించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఒంగోలులో షూటింగ్ చేసిన ప్ర‌తి చిత్రం విజ‌యం సాధించింది. ఆ కోవ‌లో ఈ చిత్రం కూడా ఘన విజ‌యం ఖాయం`` అన్నారు.
 
 తుమ్మ‌ల‌ప‌ల్లి రామ స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ...``ఈ చిత్రం ట్రైల‌ర్ చూశాక‌, పాట‌లు విన్నాక  నేటిభార‌తం, దేశంలో దొంగ‌లు ప‌డ్డారు చిత్రాలు గుర్తొచ్చాయి. అన్నీ తానై ఈ చిత్రాన్ని రూపొందించిన వెంక‌ట ర‌మ‌ణ గారికి నా శుభాకాంక్ష‌లు`` అన్నారు.
 
 ల‌య‌న్ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ..."జ‌నం" చాలా క్యాచీ టైటిల్. ట్రైల‌ర్, పాట‌లు ఆక‌ట్టుకుంటూనే ఆలోచించే విధంగా ఉన్నాయి. ఎల‌క్ష‌న్స్ స‌మ‌యంలో వ‌స్తోన్న ఈ పొలిటిక‌ల్ సెటైరిక‌ల్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించాల‌న్నారు.
 
 వి.స‌ముద్ర మాట్లాడుతూ...`` ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి గారి త‌ర‌హాలో ఈ సినిమాలో న‌టిస్తూ డైర‌క్ష‌న్  చేస్తూ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న వెంక‌ట ర‌మ‌ణ గారికి నా శుభాకాంక్ష‌లు.  క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో పాటు ఈ చిత్రంలో చ‌క్క‌టి సందేశం కూడా ఉంటుంద‌ని పాట‌లు, ట్రైల‌ర్ చూసాక అర్థ‌మైంది`` అన్నారు.
 
ద‌ర్శక నిర్మాత ప‌సుపులేటి వెంకట ర‌మ‌ణ మాట్లాడుతూ....``న‌టుడు సుమ‌న్ గారితో `దేశంలో  దొంగ‌లు ప‌డ్డారు`` చిత్రానికి ప‌ని చేశాను. అప్ప‌టి నుంచి వారితో మంచి ప‌రిచయం ఉంది. టి.కృష్ణ గారి ద‌గ్గ‌ర చాలా చిత్రాల‌కు ప‌ని చేశాను. నేను ఇందులో మాజీ న‌క్స‌లైట్ గా న‌టించాను. ఇందులో సుమ‌న్ గారే హీరో. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించారు.  జ‌నం చిత్రాన్ని రెండు పార్ట్ లుగా చేస్తున్నా. పార్ట్ 1 షూటింగ్  పూర్త‌యింది. పార్ట్ -2 కూడా త్వ‌ర‌లో ప్రారంభ‌మ‌వుతుంది. ఇందులో ఉన్న వారు దాదాపు అందులో కూడా ఉంటారు.  నిజాయితీకి..ప్ర‌జా స్వామ్యానికి మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణే ఈ చిత్రం. మా బేన‌ర్ లో ఇది మూడో చిత్రం. ఒంగోలులో సినిమా అంతా పూర్తి చేశాం. త్వ‌ర‌లో  చిత్రాన్ని విడుద‌ల  చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం.  ఇందులో  క‌మ‌ర్షియ‌ల్ అంశాలు, సందేశం, సెంటిమెంట్ , థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. పొలిటీషియ‌న్స్ తో పాటు జ‌నానికి కూడా ఈ చిత్రంలో  చుర‌క‌లు వేస్తున్నాం`` అన్నారు.