మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (16:22 IST)

రైతుకు మొదటి స్థానం ఇవ్వాలనే కాన్సెప్ట్ తో మగపులి

Clap by suman
Clap by suman
సమర సింహారెడ్డి, అక్సా ఖాన్ జంట‌గా తెలుగు శ్రీను దర్శకత్వంలో నారాయణ స్వామి నిర్మిస్తున్న చిత్రం "మగపులి"(ఫార్మర్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ అఫ్ ద వరల్డ్) అనేది ట్యాగ్ లైన్ . ఈ చిత్ర ప్రారంభోత్స‌వం సోమవారం హైద‌రాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఘ‌నంగా ప్రారంభ‌మైంది..పూజా కార్యక్రమాల అనంతరం హీరో, హీరోయిన్‌ల‌పై చిత్రీక‌రించిన తొలి ముహుర్త‌పు స‌న్నివేశానికి  సీనియర్ నటుడు సుమన్ క్లాప్ కొట్టగా, రైతు అయిన టి. రంగడు కెమెరా స్విచ్చాన్ చేశారు.
 
అనంతరం చిత్ర దర్శకుడు తెలుగు శ్రీను మాట్లాడుతూ.  ప్రస్తుతం మన దేశంలో నిరుద్యోగం, రైతు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.అలాగే రైతులు పండించిన పంటను ప్రజలకు చేరవేయడంలో డ్రైవర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అందుకే నిరుద్యోగులు, రైతులు, డ్రైవర్స్  మరియు రాజకీయ నాయకుల పై ఈ సినిమా ఉంటుంది..నిరుద్యోగ సమస్యల వలన చాలా మంది వెనుకబడి ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా వున్నవారే పదవులు అనుభవిస్తూ నెక్స్ట్ జనరేషన్ కు ఛాన్స్ ఇవ్వకపోవడం వలెనే నిరుద్యోగ సమస్య వస్తుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తీస్తున్నాము. మా సినిమాలో నటిస్తున్న సీనియర్ హీరో సుమన్, మరియు బాహుబలి ప్రభాకర్, రఘు బాబు, సుధ గార్లకు ధన్యవాదాలు. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో షూటింగ్ స్టార్ట్ అవుతున్న మా సినిమాను మూడు షెడ్యూల్స్ లో కంప్లీట్ చేసి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు.
 
సీనియర్ నటులు సుమన్ మాట్లాడుతూ... దర్శకుడు చెప్పిన కథపై నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది..దేశంలో ఉన్న నిరుద్యోగులు ప్రాబ్లమ్ మీద సినిమా తీయడం వలన చాలా సంతోషం వేసింది. కథ విన్న తరువాత ఈ కథ ప్రపంచంలో ఆన్ ఎంప్లాయిస్ ని మార్చే కథ అనిపించింది.ఇందులో నా క్యారెక్టర్  చాలా బాగుంటుంది .ఇందులో నటిస్తున్న నటీ, నటులకు దర్శకుడికి మంచి పేరు రావాలి. అలాగే నిర్మాతకు కూడా మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
చిత్ర హీరో  సమర సింహారెడ్డి,  హీరోయిన్ అక్సా ఖాన్ మాట్లాడుతూ, మంచి కాన్సెప్ట్, సీనియర్ నటులతో ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.