బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 23 నవంబరు 2017 (10:17 IST)

యుద్ధంలో గెలిచామా లేదా అన్నదే పాయింట్... 'జవాన్' ట్రైలర్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'జవాన్'. ఈ చిత్రం వచ్చే నెల ఒకటో తేదీన విడుదల కానుంది. బీవీఎస్ రవి దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్. ఈ చిత్ర

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'జవాన్'. ఈ చిత్రం వచ్చే నెల ఒకటో తేదీన విడుదల కానుంది. బీవీఎస్ రవి దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్. ఈ చిత్రం తేజు అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్‌పై కట్ చేసిన ఈ ట్రైలర్, ఆసక్తిని రేకెత్తించేలా వుంది.
 
"యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా.. వెనకోడు ఆగిపోయాడా.. ముందోడు కూలిపోయాడా కాదురా.. యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం" అంటూ విలన్‌తో సాయిధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ఆయన నటన ఈ సినిమాకి హైలైట్ అవుతుందనిపిస్తోంది. 
 
దేశ ద్రోహుల కార్యకలాపాలకు అడ్డుగా నిలుస్తూ .. వాళ్ల బారి నుంచి ఒక వైపున తన కుటుంబాన్ని .. మరో వైపున తన దేశాన్ని కాపాడుకునే యువకుడిగా ఈ ట్రైలర్‌లో సాయిధరమ్ తేజ్ కనిపిస్తున్నాడు. మొత్తం మీద ఈ ట్రైలర్.. లవ్, యాక్షన్‌ సీన్లతో ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తిని రేకెత్తించేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.