ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో వ్యూస్ పిచ్చి ఎక్కువైంది. అందరికంటే విభిన్నంగా చేయాలనే తపనతో ఏదేదో పిచ్చి చేష్టలు చేస్తున్నారు. దీనితో అవి కాస్తా ప్రాణాల మీదికి వస్తున్నాయి. తాజాగా ఓ టీనేజ్ యువతి రీల్స్ చేయడం కోసం కదిలే రైలును ఎంచుకున్నది.
తన ఫోనుని తన తోటి ప్రయాణికుడికి ఇచ్చింది. తను వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందికి దిగేటప్పుడు వీడియో తీయాలంటూ చెప్పి రైలు వేగంగా వెళ్తున్న సమయంలో రైలు ద్వారం వద్దకు వచ్చేసింది. ఐతే వీడియో తీస్తున్న వ్యక్తి... ఓ పిచ్చిపిల్లా... ట్రైన్ స్పీడుగా వెళ్తోంది. దూకొద్దూ... దూకొద్దూ అని అంటూ వున్నప్పటికీ ఆమె దూకేసింది. వీడియో తీస్తున్న వ్యక్తి అది చూసి షాకయ్యాడు. ఐతే అలా దూకేసిన యువతి ప్రాణాలతో వున్నదా లేదా అనేది మాత్రం తెలియరాలేదు. ఈ ఘటన లక్నోలో జరిగినట్లు తెలుస్తోంది..
రీల్స్ పిచ్చిలో ఇలాంటి సాహసాలు చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా అవే చేస్తున్నారు కొంతమంది. ప్రాణం పోతే మళ్లీ తిరిగి రాదు కదా... తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చవద్దని అధికారులు, పెద్దలు చెబుతున్నారు.