శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (16:45 IST)

క‌మ‌ల్‌హాస‌న్ ఫిట్‌గా వున్నారు - ఈనెల 4నుంచి వ‌ర్క్ చేసుకోవ‌చ్చు - డాక్ట‌ర్ల వెల్ల‌డి

Kamal hasan report
అంత‌ర్జాతీయ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ కోవిడ్ బారిన ప‌డి వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ట్రీట్‌మెంట్ చేసుకున్న విష‌యం తెలిసిందే. న‌వంబ‌ర్ 22న చెన్న‌య్‌లోని శ్రీ‌రామ చంద్ర మెడిక‌ల్ సెంట‌ర్‌లో ఆయ‌న ప‌రీక్ష చేసుకున్నారు. త‌న‌కు కోవిడ్ సూచ‌న‌లున్న‌రాయ‌నే అనుమానంతో ఆయ‌న వెళ్ళారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు పాజిటివ్ అని తేలింది.
 
అనంత‌రం డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స జ‌రుపుకున్నారు. వారి సూచ‌న‌ల మేర‌కు డిసెంబ‌ర్ 3వ‌ర‌కు అసొలేష‌న్‌లోనే వుండాల‌న‌డంతో ఆయ‌న అలానే వున్నారు. ఈరోజు అన‌గా బుధ‌శారంనాడు ఆసుప్ర‌తినుంచి బులిటెన్ వెలువ‌డింది. మెడిక‌ల్ డైరెక్ట‌ర్ సురేష్ ప్ర‌భాక‌ర్ తెలుపుతూ, క‌మ‌ల్‌హాస‌న్‌ పూర్తిగా కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆరోగ్య‌ప‌రంగా ఫిట్‌గా వున్నారని వెల్ల‌డించారు.  డిసెంబ‌ర్ 4వ తేదీ నుంచి య‌థావిథిగా త‌న వ‌ర్క్ చేసుకోవ‌చ్చ‌ని పేర్కొన్నారు.