శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (22:42 IST)

మమ్మల్ని పిలిచి బట్టలు విప్పమని అడిగేవాడు.. కంగనా రనౌత్ (video)

Kangana Ranaut
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చిన్న వయసులో తనకు ఎదురైన లైంగిక వేధింపులను వెల్లడించారు. తన స్వగ్రామంలో తనకంటే పెద్దవాడైన ఓ వ్యక్తి తనను ఉద్దేశ్యపూర్వకంగా అనుచితంగా తాకుతూ ఉండేవాడని తెలిపింది. ఆ సమయంలో అతడి ఉద్దేశ్యం ఏంటో తనకు అర్థం కాలేదని చెప్పింది. తనలాంటి వారిని పిలిచి బట్టలు విప్పమని అడిగేవాడని, శరీరాన్ని తడుముతూ ఉండేవాడని తెలిపారు. ఆ సమయంలో తన వయసు ఆరేళ్లు మాత్రమేనని, దీంతో అతడి చేష్టలను తాము పసిగట్టలేకపోయామని చెప్పారు. 
 
ప్రస్తుతం ఆమె "లాకప్" అనే షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అందులో ఓ కంటెస్ట్ మునవర్ షారూఖీ తాను ఆరేళ్ల వయసులో లైంగికం వేధింపులకు గురయ్యాయని, తమ దగ్గరి బంధువులు ఇద్దరు అప్పట్లో తనను లైంగికంగా వేధించారని, దాదాపు ఐదేళ్లపాటు ఇంటువంటి వేధింపులకు గురయ్యాయని చెప్పాడు. దీంతో కంగనా రనౌత్ కూడా తనకు చిన్నపుడు జరిగిన వేధింపులను వెల్లడించింది.