శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

బాలీవుడ్ టెర్రరిస్టుల చేతిలో థియేటర్లు: కంగనా రనౌత్

బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆమె దూకుడుకు మహారాష్ట్ర సర్కారు బ్రేకులు వేస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. బాలీవుడ్ చిత్రపరిశ్రమలోని అక్రమాలపై గొంతెత్తుతోంది. తాజాగా థియేటర్ల మాఫియాపై ఆమె స్పందించారు. బాలీవుడ్ టెర్రరిస్టుల చేతిలో థియేటర్లు ఉన్నాయంటూ మండిపడ్డారు. ఇలాంటి వారి నుంచి థియేటర్లతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 'నెపోటిజం టెర్రరిజం, డ్రగ్‌ మాఫియా టెర్రరిజం, సెక్సిజం టెర్రరిజం, మతాలు, ప్రాంతీయ టెర్రరిజం, విదేశీ చిత్రాల టెర్రరిజం, పైరసీ టెర్రరిజం, శ్రామికులను దోచుకునే టెర్రరిజం, టాలెంట్‌ను అణచివేసే టెర్రరిజం.. ఇలాంటి టెర్రరిజంను అంతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రాంతీయ చిత్రాల్లో ఉత్తమమైన వాటిని అనువాదం చేసి ప్యాన్‌ ఇండియాలో విడుదల చేయరు. హాలీవుడ్ చిత్రాలను అనువాదం చేసి మెయిన్‌ స్ట్రీమ్‌లో విడుదల చేస్తుంటారు. థియేటర్స్‌ మోనోపొలి, హాలీవుడ్‌ చిత్రాలను హైప్‌ చేసే మీడియా కారణంగానే ఈ పరిణామాలు జరుగుతున్నాయి' అంటూ మండిపడ్డారు. 
 
అంతేకాకుండా, కాశ్మీర్‌ టర్రెరిస్టులో మరెవరో నుండో సినీ పరిశ్రమకు వచ్చిన ప్రమాదం లేదు. అయితే సినీ ఇండస్ట్రీలో సమస్యలకు కారణమవుతున్న వారిని టెర్రిరిస్టులుగా పేర్కొన్న కంగనా రనౌత్... వారి నుంచి ఇండస్ట్రీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, నోయిడాలో అతిపెద్ద ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను నిర్మిస్తామని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కంగనా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.