శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (12:42 IST)

కౌన్‌బనేగా కరోడ్‌ పతి సీజన్.. 28 నుంచి ప్రారంభం.. 17 గంటలు పనిచేస్తున్న బిగ్ బి

కౌన్‌బనేగా కరోడ్‌ పతి (కేబీసీ) సీజన్‌-12 ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. ఈ షోను బాలీవుడ్‌ బాద్‌షా అమితాబచ్చన్‌ హోస్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్‌ను పూర్తి చేసేందుకు ఆయన ప్రతి రోజూ 12 నుంచి 14 గంటల పని చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ జూలైలో కోవిడ్‌ పాజిటివ్‌గా పరీక్షించిన తర్వాత దవాఖానలో చేరగా.. ఆగస్ట్‌ 2న టెస్ట్‌ చేసిన అనంతరం నెగెటివ్‌ రాగా డిశ్చార్జ్‌ అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో అమితాబచ్చన్‌ తాను సెట్స్‌పై ఎలాంటి అవకాశాలు తీసుకోనని, వైరస్‌కు వ్యతిరేకంగా తగిన రక్షణ నిబంధనలు పాటిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఫేస్‌ షీల్డ్‌ ధరించిన ఫొటోను షేర్‌ చేస్తూ.. సురక్షితంగా ఉండండి.. రక్షణలో ఉండండి' అంటూ లెజెండ్‌ క్యాప్షన్‌ను జోడించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు. 
 
ఈ నేపథ్యంలో షో ఈ నెల 28 నుంచి వరకు కేబీసీ-12 సోమవారం నుంచి శుక్రవారం వరకు సోని టీవీలో రాత్రి 9గంటల వరకు ప్రసారం కానుంది. కోవిడ్‌-19 భద్రతా చర్యల కారణంగా 12వ సీజన్‌ గత సీజన్ల కంటే భిన్నంగా ఉండనుంది. ఈసారి 'ఫోన్ ఏ ఫ్రెండ్' ఫార్మాట్‌లో మార్పులు చేశారని, పోటీదారులు ఫోన్‌ ఏ ఫ్రెండ్‌కు బదులు వీడియో కాల్‌ ఏ ఫ్రెండ్‌ను తీసుకువచ్చారు.