శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 నవంబరు 2023 (16:29 IST)

చిక్కుల్లో పడిన కేజీఎఫ్ నటి.. ఆధార్ తప్పుగా వాడారని...

malavika-avinash
malavika-avinash
కేజీఎఫ్‌ నటి "మాళవిక అవినాష్‌" చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ ఉంటున్నారు. తాజాగా, మాళవిక అవినాష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆధార్‌ కార్డును తప్పుడుగా వినియోగించారన్న కారణంతో ఆమెకు ట్రాయ్‌ నోటీసులు జారీ చేసింది.
 
గురువారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ట్రాయ్‌ నుంచి ఆమెకు ఫోన్‌ కాల్‌ కూడా వచ్చింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. తనకు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ట్రాయ్‌నుంచి ఫోన్‌ వచ్చింది. తాను ఆధార్‌ కార్డును తప్పుగా వాడి సిమ్‌ తీసుకోలేదని వారికి చెప్పాను. తర్వాత వారు పోలీస్‌లకు కూడా ఫోన్‌ కలిపారు. తనతో మాట్లాడిన ఎస్‌ఐ కొంచెం కూడా జాలి లేకుండా మాట్లాడాడు. తనతో ముంబై వచ్చి కంప్లైంట్‌ ఇవ్వమన్నాడు.
 
"నేను ఓ నటిని అని చెప్పటానికి ప్రయత్నించాను. అయితే, అతడు వినే ఆసక్తితో లేడు. నేను వీడియో కాల్‌ చేసినపుడు నన్ను కేజీఎఫ్‌ నటి అని గుర్తించాడు. 
 
వెంటనే నాకు అండగా నిలిచాడు. దీన్ని బట్టి ఆధార్‌ కూడా పాస్‌ పోర్టులా చాలా ముఖ్యమైందని అర్థం అయింది. దాన్ని చాలా భద్రంగా దాచుకోవాలి. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశ పౌరులుగా మనం ఆధార్‌ను సరిగా పట్టించుకోవటం లేదు" అని తెలిపారు.