శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 నవంబరు 2023 (15:02 IST)

కోలీవుడ్ సీనియర్ నటుడు జూనియర్ బాలయ్య కన్నుమూత

Junior Balaiah
Junior Balaiah
కోలీవుడ్ సీనియర్ నటుడు జూనియర్ బాలయ్య అనారోగ్య సమస్యలతో గురువారం కన్నుమూశారు. జూనియర్ బాలయ్య తన నలభై ఏళ్ల సినీ ప్రయాణంలో వందకు పైగా తమిళ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.
 
అనారోగ్య కారణాలతో ఆయన తుది శ్వాస విడిచారు. తమిళ దిగ్గజ నటుడు టీఎస్ బాలయ్య వారసుడిగా జూనియర్ బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నలభై ఏళ్ల సినీ ప్రయాణంలో వందకు పైగా తమిళ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా నటించారు.
 
అతను జెమినీ గణేశన్ మరియు విజయ్ కాంత్ వంటి ఒకప్పటి అగ్ర హీరోలతో ప్రారంభించి, అజిత్, విజయ్ వంటి నేటి హీరోలతో స్క్రీన్‌ను పంచుకున్నారు.