ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (10:48 IST)

'కాంతార' వసూళ్ల దూకుడు.. : గ్లోబల్ గ్రాస్ రూ.305 కోట్లు

kantara movie
కన్నడ హీరో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా నటించిన చిత్రం "కాంతార". కన్నడ, హిందీ భాషల్లో గత సెప్టెంబరు 30వ తేదీన విడుదలైంది. తొలి రోజునే ఆ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత అంటే 15 రోజుల తర్వాత తెలుగు, తమిళంలో విడుదలైంది. ఇక్కడ కూడా అదే స్థాయిలో వసూళ్ళు రాబట్టింది. హిందీలోనూ అదే భారీ స్పందన వచ్చింది. ఇలా ఈ చిత్రం విడుదలైన ప్రతి భాషలోనూ సంచలన విజయాన్ని నమోదు చేసింది.
 
ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.305 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా టీమ్ అధికారికంగా ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ముందుగా ఈ సినిమా కన్నడంలో మాత్రమే చేయాలని భావించారు. అందుకే ఆ ప్రాంత ఆచార, విశ్వాసతాలతో కూడి కథను ఎంచుకున్నారు. 
 
ప్రధానమైన కథ అంతా కూడా స్థానికంగా ఉండే జానపదుల విశ్వాసం చుట్టూ తిరుగుతుంది. అందుకే కన్నడ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అదేవిధంగా ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు అన్ని భాషల్లో ఏకంగా రూ.305 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టింది. 
 
అడవి నేపథఅయంలో అమాయక గిరిజనులకు అన్యాయం తలపెడితే అక్కడి గ్రామదేవత అక్రమార్కులకు ఎలా బుద్ధి చెప్పిందన్నదే ఈ కథ. ఇది అన్ని భాషల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అందువల్లే ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించిందని ప్రతి ఒక్కరూ అంటున్నారు.