శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 11 జనవరి 2019 (22:26 IST)

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం ప్రారంభం..!

అనుష్క‌, న‌య‌న‌తార‌, త్రిష‌, త‌మ‌న్నా, స‌మంత.. ఓ వైపు రెగ్యుల‌ర్ సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నారు. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతున్నారు. ఇప్పుడు వీరి స‌ర‌స‌న కీర్తి సురేష్ చేరింది. అవును.. మ‌హాన‌టి సినిమాలో అద్భుతంగా న‌టించి మెప్పించిన కీర్తి సురేష్ లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి కూడా ఓకే చెబుతుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన మహేష్‌ కోనేరు నిర్మిస్తున్న సినిమాలో కీర్తి సురేష్ న‌టిస్తుంది.
 
వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ సినిమా ద్వారా న‌రేంద్ర‌ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఈ సినిమా ఈరోజు అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. దీనికి క‌ళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్, వెంకీ అట్లూరి, భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ త‌దిత‌రులు ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి హాజ‌రై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌చేసారు.