బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 24 నవంబరు 2018 (15:20 IST)

ఆ హీరోతో సినిమాలు చేయనంటున్న కీర్తి... ఎందుకు?

కీర్తి సురేష్‌. తమిళ సినీపరిశ్రమలోనే కాకుండా తెలుగులోను కీర్తి అగ్రహీరోయిన్లలో ఒకరుగా ఎదుగుతున్నారు. చేతిలో ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో ఆమె నటిస్తోందంటే ఛాన్సులు ఏవిధంగా వస్తున్నాయో చెప్పనవసరం లేదు. అయితే సినిమాల్లో నటించేటప్పుడు మాత్రం ఆలోచించి నటిస్తోందట కీర్తి సురేష్‌. ముఖ్యంగా హీరోల విషయంలో బాగా జాగ్రత్తపడుతోందట.
 
దీంతో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నానితో సినిమా చేయనని తెగేసి చెబుతోందట కీర్తి. కారణం బిజీ షెడ్యూల్ ఒకటైతే మరో కారణం నాని సినిమాల్లో గ్యాప్ తీసుకోవడం, అతని సినిమాలు కొన్ని ఫ్లాప్‌లు కావడమేనట. అందుకే లేటైనా ఫర్వాలేదు మంచి హీరోతో చేయాలన్న ఆలోచనలో ఉందట కీర్తి. అయితే కీర్తి తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చ సాగుతోంది. నాని లాంటి యువ నటుడితో సినిమా చేయనన్న కీర్తి ఇంకెంతమందిని వద్దంటుందోనని చెవులు కొరుక్కుంటున్నారు.