ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (11:36 IST)

ప్రభాస్ రామాయణం.. దశరథ మహారాజుగా ఎవరంటే?

తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో రామాయణం సినిమా పై మరోసారి మేకర్స్ దృష్టి పడింది. ఇప్పటికే ప్రబాస్ హీరోగా .. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ప్రభాస్ ప్రభు శ్రీరామ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ నటిస్తోంది. 
 
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో 3Dలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కోసమే దాదాపు రూ. 200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు .మరోవైపు ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. 
 
ఈ చిత్రంలో కీలకమైన రాముడి తండ్రైన దశరథుడి పాత్రలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో రావణాసుడి భార్య మండోదరి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఆ పాత్రలో శ్రియ పేరును పరిశీలిస్తున్నారు.