1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (13:27 IST)

"ఆదిపురుష్‌"లో సీతపాత్ర ఎంతగానో నచ్చింది : కృతి సనన్

kritisanon
స్టార్ హీరో ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో సీత పాత్రలో నటించడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ పాత్ర కూడా తనకు ఎంతగానో నచ్చిందని బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ అన్నారు. ఈ సినిమాను చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తన పాత్ర బాగుందని మెచ్చుకుంటారని చెప్పారు. 
 
ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, కృతిసనన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని తన పాత్ర గురించి కృతి సనన్ మాట్లాడుతూ, ఇలాంటి సినిమాలో నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపింది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూశాక అలానే అనుకుంటారని చెప్పింది. 
 
పైగా, ఈ చిత్రంలోని సీత పాత్ర తనకు ఎంతగానో నచ్చిందన్నారు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదనీ, ఒక విజువల్‌ వండర్‌ అని తెలిపింది. ఇలాంటి సినిమాలు పిల్లలకూ ఎంతో నచ్చుతాయని చెప్పింది. రామానంద్‌ సాగర్‌ రామాయణాన్ని చూడలేదన్నారు. కానీ, ఆదిపురుష్‌ సినిమా చూశాక పిల్లల్లో రామాయణంపై అవగాహన పెరుగుతుందని వ్యాఖ్యానించారు.