"ఖుషి" నుంచి మెమరబుల్ ఫోటో.. పవన్‌తో ఎస్‌జే సూర్య
స్టార్ డైరక్టర్ ఎస్ జే సూర్య ఖుషి సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్‌తో దిగిన ఒక మెమరబుల్ ఫోటోను షేర్ చేసారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటో కాసేపటికే వైరల్ అయ్యింది.
పవన్ కుర్చీలో కూర్చుని ఉండగా.. సూర్య ఆయన మెడ చుట్టూ చేతులు వేసి నిలబడి ఉన్నాడు. పవన్ ఎంతో స్టైలిష్‌గా కళ్లద్దాలు పెట్టుకుని ఉన్నాడు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రెజెంట్ పవన్ చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ ప్రకటించాడు.
అలాగే తమిళంలో సముద్రకని తెరకెక్కించిన 'వినోదయ సీతమ్' సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు.