మహేష్ బాబు చట్టానికి కట్టుబడే పౌరుడు... లీగల్ టీం ఆఫ్ జి.మహేష్ బాబు
జిఎస్టి కమిషనరేట్, హైదరాబాద్ వారు, కోర్టు పరిధిలో ఉన్న 18 లక్షల 50 వేల రూపాయల పన్నుని వడ్డీతో కలిపి 73 లక్షల 50 వేలుగా నిర్ణయించి బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించారు. 2007 - 08 ఆర్ధిక సంవత్సరానికి గాను అంబాసిడర్ సర్వీసెస్‌కి ఈ పన్ను చెల్లించాలని వారు నిర్ణయించారు.
వాస్తవానికి ఆ కాలంలో అంబాసిడర్ సర్వీసెస్ ఎటువంటి టాక్స్ పరిధిలోకి రాదు. అంబాసిడర్ సర్వీసెస్‌ని టాక్స్ పరిధిలోకి సెక్షన్ 65 (105) (zzzzq) ద్వారా 01 -07 -2010 నుండి చేర్చడం జరిగింది. టాక్స్ పేయర్ చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నా, ఎటువంటి నోటీసు లేకుండా, పైగా ఈ విషయం ఇంకా కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ జిఎస్‌టి కమిషనరేట్ బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించడం జరిగింది. మహేష్ బాబు చట్టానికి కట్టుబడే పౌరునిగా తన పన్నులన్నిటినీ సక్రమంగా చెల్లించారు.
- లీగల్ టీం ఆఫ్ జి.మహేష్ బాబు