"లైగర్‌''కు షాకిచ్చిన సెన్సార్ బోర్డు - 'ఎఫ్' వర్డ్ సీన్లకు కత్తెర

గురువారం, 18 ఆగస్టు 2022 (16:42 IST)
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన "లైగర్" చిత్రం ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టు సమాచారం. 
 
ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఒకటి, రెండు కాదు ఏకంగా ఏడు చోట్ల కత్తెర వేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో అనేక అభ్యంతర సన్నివేశాలు ఉన్నాయని, వాటిని పూర్తిగా తొలగించాలంటూ సెన్సార్ బోర్డు సభ్యులు జట్టుకు తెలిపారు. సాధారణంగా విజయ్ దేవరకొండ చిత్రంలో అధికంగా బోల్డ్ డైలాగులు ఉంటాయి. 
 
ఇక 'ఊరమాస్' డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తోడయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పైగా, ఇందులో ఎఫ్ వర్డ్ సన్నివేశాలు అధికంగానే ఉన్నాయని, వీటన్నింటినీ తొలగించాల్సిందేనంటూ సెన్సార్ బోర్డు సభ్యులు తేల్చి చెప్పారు. 

అన్నీ చూడండి

కర్నాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో వీధి కుక్కల స్త్వైర విహారం, వీడియో

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు కోర్టు ఉపశమనం.. ఆన్‌లైన్‌లో వ్యాప్తికి అడ్డుకట్ట

హన్మకొండ బాలుడు నిరంజన్ వద్దకు గంటలో కుక్కపిల్ల పంపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్, వీడియో

పానీపూరీ తిన్న 15మంది పిల్లలకు అస్వస్థత.. ఏమైంది?

ప్రియురాలితో పెళ్లి కోసం భారీ చోరీకి పాల్పడిన ప్రియుడు

అన్నీ చూడండి

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

పిస్తా పప్పులు ఎందుకు తినాలి?

యూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు

కేన్సర్‌ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?

వామ్మో.. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ ... వైద్యులేమంటున్నారు...

తర్వాతి కథనం
Show comments