రౌడీ హీరో లైగర్ నుంచి డబుల్ ధమాకా అప్డేట్

గురువారం, 16 డిశెంబరు 2021 (18:11 IST)
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం లైగర్‌ నుంచి డబుల్ ధమాకా అప్డేట్ వచ్చేసింది. లైగర్ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించేశారు. ఇక రెండో అప్ డేట్ ఏంటంటే.. కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31న లైగర్ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నారు.
 
అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేయ‌డంతో పాటు ఛార్మితో క‌లిసి పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మిస్తున్నారు. అలాగే ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
 
విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను స‌రికొత్త లుక్‌, క్యారెక్ట‌రైజేష‌న్‌తో పూరి త‌న‌దైన స్టైల్లో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్రెజంట్ చేస్తున్నారు. పూరీ జ‌గ‌న్నాథ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే ఇలా మొత్తం యూనిట్‌కు లైగ‌ర్ తొలి పాన్ ఇండియా మూవీ. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.

అన్నీ చూడండి

వందేమాతరాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలుశిక్ష : కేంద్రం

నెలకు ఇంటి అద్దె రూ.80 వేలు.. అయినా క్యాబ్ డ్రైవర్

నిలకడగా వాంగ్‌చుక్ ఆరోగ్యం... కాక్రోచ్ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ పిలుపు

నేతలెవ్వరూ గాంధీ భవన్ వైపు రావొద్దంటున్న సీఎం రేవంత్ రెడ్డి

మామ ప్రైవేట్ భాగాన్ని బ్లేడుతో కోసేసిన కోడలు (వీడియో)

అన్నీ చూడండి

గర్భిణీలకు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఎందుకు?

ఈ వర్షాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ కుటుంబ రోగనిరోధక శక్తిని పదిలంగా ఉంచుకోండి

ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్

హైదరాబాద్‌లో అత్యాధునిక ఐసీయూ ఏర్పాటుకు మెడ్‌ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం

బరువు నిర్వహణ కోసం సోహా అలీ ఖాన్ తెలివైన ఆహార ఎంపికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments