మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (14:51 IST)

లైగ‌ర్ షెడ్యూల్ పూర్తి - మైక్ టైస‌న్‌తో డిన్న‌ర్

Liger team with Mike Tyson
విజయ్ దేవరకొండ హీరోగా న‌టిస్తోన్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ `లైగర్` (సాలా క్రాస్ బ్రీడ్) చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. మైక్ టైసన్ ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టడంతోనే ఈ సినిమాపై అంచనాలు ఆకాశన్నంటాయి. ఇటీవ‌ల అమెరికాలో ప్రారంభ‌మైన ఈ మూవీ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ షెడ్యూల్‌లో మైక్ టైస‌న్ పాత్ర‌కి సంభందించిన చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసింది చిత్ర యూనిట్.
 
`మైక్ టైసన్ సంపూర్ణ సహాకారమందించారు.. ఆయ‌న‌తో షూటింగ్ స‌జావుగా సాగింది` అంటూ షూటింగ్ లొకేష‌న్ నుండి కొన్ని ఫోటోల‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ ఫోటోల‌లో మైక్‌టైస‌న్ భార్య కికి ని కూడా చూడొచ్చు.
 
మైక్ టైసన్ ఈ చిత్రంలో కీలకమైన మరియు శక్తివంతమైన పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
 
మైక్ టైసన్ రాకతో ఈ ప్రాజెక్ట్ అంచనాలు కూడా మారిపోయాయి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి.
 
థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్  చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.
 
రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో రూపొందిస్తున్నారు.
 
లైగర్ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.
 
నటీనటులు : విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలి, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను
 
సాంకేతిక బృందం-  దర్శకుడు:  పూరి జగన్నాథ్,  నిర్మాతలు:  పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, 
బ్యానర్స్:   పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్,  కెమెరామెన్ : విష్ణు శర్మ, ఆర్ట్ డైరెక్టర్ : జానీ షేక్ బాషా, ఎడిటర్ : జునైద్ సిద్దిఖీ,