బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (15:16 IST)

మైక్ టైసన్‌తో కలిసి లాస్ వెగాస్‌లో ప్రారంభమైన "లైగర్" షూటింగ్

తెలుగు హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కయికలో రానున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘లైగర్’. సాలా క్రాస్ బ్రీడ్ ట్యాగ్ లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
ఇప్పటికే, ముంబై, హైద్రరాబాద్ నగరంలో చిత్రీకరణ జరుపుకుంది. తాజా షెడ్యూల్ మంగళవారం యూఎస్‌లోని లాస్ వెగాస్‌లో మొదలైంది. విజయ్ దేవరకొండ, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌పై కీలక సన్నివేశాల్ని ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించబోతున్నారు.
 
తాజాగా "లైగర్" దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్యా పాండే, నిర్మాత ఛార్మీ కౌర్ మైక్ టైసన్‌తో ఫోటోస్ దిగి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో షేర్ అయిన ఈ ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.